అబద్దాలు చెప్పడంలో సీఎం,మంత్రులు పోటీపడుతున్నారు : ప్రశాంత్ రెడ్డి

-

ఉత్తర రీజినల్ రింగ్ రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్దాలు చెప్పడంలో సీఎం,మంత్రులు పోటీ పడుతున్నారు అని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన పనులను తాము చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రిక. దూరదృష్టితో రీజినల్ రింగ్ రోడ్డుకు కేసీఆర్ రూపకల్పన చేశారు. 27 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలని భావించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 14 నేషనల్ హైవేస్ ను కలుపుకుని రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుండి అంగీకారం తీసుకుని భూసేకరణకు 50 శాతం రాష్ట్రం నుండి ఇస్తామని కేసీఆర్ కేంద్రానికి చెప్పారు. 2017 లో కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్రం ఆలస్యం చేస్తుంటే 2018లో కేసీఆర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భారతమాల పేజ్1 లో ఉత్తర రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2021 కరోనా సమయంలో మళ్లీ కేసీఆర్,మేము కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అప్రూవ్ చేయాలని కోరాము. 2021 డిసెంబర్ 6వ తేదీన కేంద్రం రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అప్రూవల్ చేసింది. భూసేకరణకు 100 కోట్ల రూపాయలు మేము కేంద్రం వద్ద డిపాజిట్ చేశాము. కేంద్రం 2వేల కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పింది. ఓ.ఆర్.ఆర్ వెళ్లే నాలుగు జిల్లాల్లో 76 శాతం భూసేకరణ పూర్తి చేశాము. భూసేకరణ కోసం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ ను పెట్టాము. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో మేము భూసేకరణ కోసం పెట్టిన వంద కోట్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version