ప్రియమణి అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, తమిళ, మళయాళం ప్రేక్షకులకి ఎంతో అభిమాన నటి. సిల్వర్ స్క్రీన్ కి పరిచయమవుతూ పరుత్తివీరన్ సినిమాలో నటించి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సాధించారు. చెప్పాలంటే ఇలా మొదటి సినిమాతోనే జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సాధించడం అంత సులభమైన విషయం కాదు. అయినా తను కొన్ని పరాభవాలను చూశారు. తెలుగులో వల్లభ హీరోగా నటించిన ఎవరే అతగాడు సినిమాతో పరిచయమైంది. అయితే ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ తెలుగు సినిమా ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు. కాని తమిళంలో మాత్రం సినిమాలు చేస్తూ హీరోయిన్ గా సక్సస్ అయ్యారు.
ఆ సక్సస్ చూసి మళ్ళీ తెలుగులో జగపతి బాబు హీరోగా వచ్చిన కుటుంబ కథా చిత్రం పెళ్ళైన కొత్తలో సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడం తో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో నటనకి చిత్ర పరిశ్రమలోని చాలామంది పొగడ్తలతో ముంచెత్తారు. పెద్ద పెద్ద దర్శక నిర్మాతల నుంచి ప్రశంసలు అందుకుంది. దాంతో ప్రియమణి కి వరుసగా ఎన్.టి.ఆర్, నాగార్జున, సూర్య, గోపీచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక ఎన్.టి.ఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.
అయితే సినిమా అవకాశాలు ఉన్న పలంగా తగ్గడంతో 2017 లో ముస్తఫా రాజ్ ని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత మళయాళంలో ఒక డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించారు. అది చూసే తెలుగులో అతి పెద్ద డాన్స్ షో ఢీ సిరీస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ప్రియమణి కి తెలుగులో ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. అది కూడా విక్టరీ వెంకటేష్ సరసన. తమిళంలో భారీ హిట్ అయిన అసురన్ రీమేక్ తెలుగులో వెంకటేష్ తో నారప్ప గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ సినిమా మీద ప్రియమణి చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా గనక హిట్ అయితే సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని నమ్మకంగా ఉన్నారు.