రాష్ట్రంలో ఒకే నియోజకవర్గం నుంచి నాలుగు నుంచి ఐదు సార్లు గెలిచిన నాయకులు ఉన్నారు. వారసులుగా అరంగేట్రం చేసి రాజకీయాలను నడిపిన నాయకులు ఉన్నారు. అయితే, ఎంత మంది నాయకులు.. “ ఆయనసేవ చేయడానికే వచ్చాడు బుజ్జీ !“-అని అనిపించుకున్నారు. ఏదో పాతతరంలో అయితే, ఓ నలు గురు.. ఉండేవారు. కానీ, నేటి తరంలో అందునా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టినవారిలో ఎందరు ఉన్నారు ? అంటే ప్రశ్న మాత్రమే కనిపిస్తుంది. దీనికి సమాధానం చెప్పే వారు ఒక్కరూ కనిపించరు. కారణం ఏంటంటే.. సొంత లాభం కోసమే రాజకీయాలు చేస్తున్నవారు పెరిగిపోతున్నవారు ఎక్కువ మంది ఉండ డం.
నిజానికి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పదుల సంఖ్యలో నాయకులు తొలిసారి గెలిచి అసెంబ్లీ గడప తొ క్కారు. మరి వీరిలో ఎంత మంది ప్రజల మధ్యకు వస్తున్నారు. అందునా.. కరోనా ఎఫెక్ట్‌తో అల్లాడు తున్న పేద లకు, వలస కూలీలకు, నిరుద్యోగులకు, ఎలాంటి ఆధారమూ లేనివారికి సాయం చేస్తున్నారు? అం టే.. చెప్పడం కష్టం. ఇలాంటి సమయంలో మట్టిలో మాణిక్యం మాదిరిగా.. వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ఒకరు వార్తల్లో నిలిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన బియ్యపు మధుసూదన రెడ్డి ప్రజలకు అంకిత భావంతో సేవ చేయడంలో ముందున్నారు.
ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో పనులు లేక ఇంటికే పరిమితమైన పేద కుటుంబాలు అనేకం ఉన్నాయి. అదేసమయంలో నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు కూడా డబ్బులులేక అల్లాడుతున్న పేదలు కూడా ఉన్నారు. వీరికి ఏదో ఒక రూపంలో సాయం చేయాలనినిర్ణయించుకున్న మధు సూదనరెడ్డి.. దాదాపు 10 వేల కిలోల బియ్యాన్ని నియోజకవర్గంలోని పేదలకు పంచారు.
భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా బియ్యం సంచులను పేదలకు పంచారు. అయితే, ఈ సమయంలో ఆయన ఎక్కడా కూడా తన స్వోత్కర్షను చెప్పుకోలేదు. ఎందరో చేసిన సాయం తనకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొంటూ.. వారి వారి కటౌట్లతో ట్రాక్టర్లకు కట్టి.. బియ్యాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి.. ప్రజలకు పంచారు. మరి ఇలాంటి నాయకుడిని ప్రశంసించకుండా ఎలా ఉండగలం!!