చిరంజీవి సహకారంతోనే చంటి సినిమా తీసిన వెంకటేష్..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు వెంకటేష్. వెంకటేష్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్ర చంటి. ఈ చిత్రంలో ఒక అమాయకుడు పాత్రలో వెంకటేష్ నటించి.. ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక ఈ చిత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు హీరో వెంకటేష్.జమీందారీ కుటుంబంలో ఉండే అమ్మాయికి ముగ్గురు అన్నయ్యలు ఉండే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి 29 సంవత్సరాలు అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి కి అన్యాయం జరిగిందట. తమిళ్ మూవీ చిన తంబీ సినిమాను తెలుగులో చంటి పేరుతో రీమేక్ చేయడం జరిగింది.

వాస్తవానికి ఈ చిత్రానికి మొదట హీరో రాజేంద్రప్రసాద్ ని అనుకున్నారట. కానీ సురేష్ బాబు కె.ఎస్.రామారావు దగ్గరకు వచ్చి వెంకటేష్ తో కలిసి సినిమా చేయాలని అడిగారట. ఆ సమయంలోనే చిరంజీవి జోక్యం చేసుకొని డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి కి వెంకీతో సినిమా చేసేలా ఆలోచన పుట్టించారు. అలా రాజేంద్ర ప్రసాద్ ను తప్పించి హీరో వెంకటేష్ తో ఈ సినిమా చేయడానికి చిరంజీవి కారణం అయ్యాడని చెప్పవచ్చు. దీంతో రాజేంద్రప్రసాద్ కు చిరు అన్యాయం చేశాడని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి.

ఏది ఏమైనా హీరో వెంకటేష్ చంటి చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మైమరిపించేలా చేశాడు. ఈ చిత్రం ఇప్పటికి కూడా బుల్లితెరపై ప్రసారం అయిందంటే చాలు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version