తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో శనివారం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.‘నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జన సేవకుడిగా, సహచరుల సహకారంతో విమర్శలను సహిస్తూ విద్వేషాలను ఎదురిస్తూ ప్రపంచంలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేందుకు ముందుకు సాగిపోతున్నాను.
ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి. సమస్త ప్రజల ఆకాంక్షలు, సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి’ అని ట్వీట్లో రాసుకొచ్చారు. ఇదిలాఉండగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అద్బుతమైన మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ తర్వాత రేవంత్ తెలంగాణకు మూడో సీఎంగా ఘనత సాధించారు.