వామ్మో కల్తీ.. పాలలో బేకింగ్ సోడా.. అధికారులకు ఫిర్యాదు

-

తెలంగాణలో ఇటీవల కల్తీ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. దివ్య ఔషధంగా పరిగణించే పాల విషయంలో ఊహించని నిజాలు జగిత్యాల జిల్లావాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.పాలను కల్తీ చేసే వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆదేశించినా.. కల్తీ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు.

జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలలో సోడా కలుపుతున్నారు.ఈ విషయాన్ని అతని దగ్గర పాలు విక్రయించేవారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో పాలల్లో కల్తీ వ్యవహారం బయటపడింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడేవారని ఉపేక్షించకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news