అనారోగ్యంతో వెంటిలేటర్‌పై ప్రముఖ నటి..!

-

ప్రముఖ కన్నడ నటి జయంతి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మంగళవారం బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే పరీక్షల్లో జయంతికి కరోనా నెగిటివ్ గా వచ్చింది. దాంతో వారి కుటుంబసభ్యులంతా కొంత ఉపశమనం పొందారు.

గత 35 ఏళ్లుగా అస్తమాతో బాధపడుతున్న ఆమె.. 2018లో కూడా ఇదే కారణంతో ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లో చేరారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో హస్పిటల్‌లో చేర్పించాం. వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దక్షిణాదిలో తెలుగు, కన్నడం, తమిళం, మలయాళ రంగాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ జయంతి నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version