సీఎస్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల అభ్యంతరం

-

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ అన్న వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రులు తిరుగుదాం తనతో రావాలని అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిన్న సీఎస్‌కు సవాల్ విసరగా… తాజాగా నేడు ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సీఎస్‌ వ్యాఖ్యలను ఖండించారు.

తెలంగాణలో లాక్ డౌన్ అవసరం లేదంటున్న సీఎస్, పరిస్థితులు ఎక్కడ బాగున్నాయో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో ఓ వైపు కరోనా పరీక్షలు చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా నిర్దారణ అవుతుంటే… మరో వైపు విశ్లేషకులు దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తుంటే సీఎస్‌ ఇలా వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు పడకలు దొరకడం లేదని, అలానే ఆక్సిజన్ కొరత ఉందని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేసారు. సీఎస్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు. హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు.

ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై కూడా వీహెచ్ మండిపడ్డారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వీహెచ్ తీవ్రంగా ఖండించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి ప్రజాదరణ పొందిన మహిళా నాయకురాలిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. గతంలో బీజేపీ అధ్యక్షులుగా ఉన్న బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్ మహిళా నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదని అన్నారు. ప్రస్తుతం కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో బండి సంజయ్ కేంద్ర మంత్రులతో, అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు వాక్సిన్ అందేలా చేస్తే బాగుంటుందని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version