తీవ్రంగా వేధిస్తున్న వ్యాక్సిన్ల కొర‌త‌.. తెలంగాణలో 4ల‌క్ష‌లే..

-

ఓ వైపు రోజురోజుకూ క‌రోనా తీవ్ర రూపం దాల్చుతోంది. ఇలాంటి టైమ్ లో వ్యాక్సిన్లు విరివిగా వేయాల్సింది పోయి.. తీవ్ర కొర‌త వేధిస్తోంది. మే1 నుంచి 18ఏళ్ల పైబ‌డిన వారంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామ‌న్న‌ప్ర‌భుత్వాలు.. ఆఖ‌ర‌కు చేతులెత్తేశాయి. పోనీ 45ఏళ్ల వారికి అయినా వేస్తారా అంటే అదీ లేద‌ని తెలుస్తోంది.

ఎందుకంటే ఇప్ప‌టికే రాష్ట్రంలో మొద‌టి డోస్ వేసుకున్న వారు దాదాపు 36ల‌క్ష‌ల మంది ఉండ‌గా.. వ్యాక్సిన్లు మాత్రం 4ల‌క్ష‌ల మేర‌కే అందుబాటులో ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఆల్రెడీ వేసుకున్న‌వారంతా రెండో డోస్ కోసం ఇప్ప‌టికే టీకా కేంద్రాల‌కు క్యూ క‌డుతున్నారు. వీరిలో ప‌ది శాతం మందికి కూడా వ్యాక్సిన్లు స‌రిపోవు. మ‌రి మిగ‌తా వారి సంగ‌తేంటి? అస‌లు వేసుకోని వారికి వేస్తారా లేదా అనేది ఇప్పుడున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version