పవన్ కళ్యాణ్ పై గెలుపు నాదే: వంగా గీత

-

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటన చేశారు. అయితే పిఠాపురం వైసీపీ సమన్వయకర్తగా కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు.

పిఠాపురంలో ఎవరు పోటీ చేసినా గెలుపు తనదేనని ఎంపీ, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తన విజయం ఇంకా సులువవుతుందని తెలిపారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు రేపు తనను కలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కబురు పంపారు.కాగా, వంగా గీత 1983లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె 1985 నుంచి 87 వరకూ మహిళా శిశు సంక్షేమ రీజనల్‌ చైర్‌ పర్సన్‌గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, 1995 నుంచి 2000 వరకూ తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌గా పని చేసింది. వంగా గీత 2000 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా, 2009 నుంచి 2014 వరకూ పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేసింది. ఆమె 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version