జ‌గ‌న‌న్న‌కు అండ‌గా ఉందాం..లాయర్లను కోరిన రజిని

-

న్యాయ‌వాదుల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి, వాటి ప‌రిష్కారానికి కృషి చేసిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాత్ర‌మే అని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. గుంటూరు జిల్లా న్యాయవాదులు పెద్ద ఎత్తున సోమ‌వారం చంద్ర‌మౌళి న‌గ‌ర్, సాయిబాబారోడ్డు లోని గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యానికి సోమ‌వారం త‌ర‌లివ‌చ్చి విడ‌ద‌ల ర‌జినికి సంఘీభావం ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు మాట్లాడుతూ కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా జ‌గ‌న‌న్న ఆర్థిక సాయం అందిస్తున్నార‌ని తెలిపారు. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంద‌ని, ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తున్నామ‌ని వివ‌రించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్‌ చొప్పున అంద‌జేస్తున్న తొట్ట తొలి ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం అని తెలిపారు. మొత్తం 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించిన ఘ‌న‌త జ‌గ‌న‌న్న‌కే ద‌క్కుతుంద‌ని పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్‌ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news