ఎక్కడైనా అవినీతికి తావిస్తే…తాట తీస్తానని హెచ్చరించారు మంత్రి విడదల రజిని. చిలకలూరిపేట నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి విడదల రజిని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక తన కార్యాలయంలో మంత్రి విడదల రజిని గారు చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అధికారులు విధుల్లో గాని, పనుల నిర్వహణలోగాని అవినీతికి తావీకుండా పనిచేయాలని మంత్రి గారు ఆదేశించారు. ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గ్రామాలు, వార్డుల్లో ప్రజలను అప్రమత్తం చేసి అభివృద్ధి పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, రెవెన్యూ, ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూ ఎస్, మున్సిపల్, విద్య, వైద్యం తదితర విభాగాలకు చెందిన నియోజకవర్గ స్థాయి అధికారులంతా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డు చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.