శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత

-

తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ప్రస్తుతం 16 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.

Lifting of 16 gates of Sriram Sagar project

ఎగువ నుంచి ప్రాజెక్టులోకి దాదాపు 60 వేల క్యూసెక్కులు చేరుతుండగా… 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1000 91 అడుగులు కాగా ప్రస్తుతం అంతే గరిష్టానికి నీరు చేరడంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఇందులో భాగంగానే 16 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు.

కడెం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తిన అధికారులు.. దిగువకు నీటిని వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులకు చేరింది. జలాశయంలోకి 21,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 17,745 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version