అరెస్టుకు ముందు నటి కస్తూరి వీడియో..వెలుగులోకి షాకింగ్ నిజాలు !

-

నటి కస్తూరి కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అరెస్టుకు ముందు నటి కస్తూరి..వీడియో రికార్డు చేసింది. తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించిన నటి కస్తూరి.. వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. షూటింగ్ ముగిసిన వెంటనే పోలీసులకు సహకరించానని వెల్లడించారు.

kasthuri

ఎగ్మోర్ పోలీసులకు పూర్తిగా సహకరించాను..తనకు ఎలాంటి భయం లేదన్న కస్తూరి.. పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. కాగా, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు అయిన నటి కస్తూరిని పోలీసులు చెన్నయ్ తరలించారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ రాజకీయపార్టీ సభలో నటి కస్తూరి తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీంతో ఆమెపై పలువురు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం చెన్నై పోలీసులు ఆమెను సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌లో అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news