బఠానీలు అమ్ముకుంటున్న పాక్ క్రికెటర్.. వీడియో వైరల్

-

పాక్‌ బౌలర్‌ వహాబ్‌ రియాజ్‌ 2015 ప్రపంచ కప్‌ లో అద్భుతమైన పాస్ట్‌ బౌలింగ్‌తో అందరినీ ఆశ్చర్య పరిచాడు. 2015 ప్రపంచ కప్‌ లో పాక్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శనతో వహాబ్‌ 16 వికెట్లు పడగొట్టాడు. ఇక వహాబ్‌ డిసెంబర్‌ 2020 నుంచి పాక్‌ జట్టుకు దూరమయ్యాడు. ఇది ఇలా ఉండగా… తాజాగా ఈ బౌలర్‌ వహాబ్‌ రియాజ్‌ కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ గా మారింది.

పల్లీలు, బఠానీలు అమ్ముకుంటూ వహాబ్‌ రియాజ్‌ ఈ వీడియోలో కనిపించాడు. రోడ్డు పక్కన ఉన్న పల్లీల వ్యాపారి వద్దకు వెళ్లిన వహాబ్‌ రియాజ్‌… అతనిలాగే.. వాటిని అమ్మడం మొదలు పెట్టాడు. అంతేకాదు.. ఓ కస్టమర్‌ కు పల్లీలు కూడా అమ్మాడు. ఈ వీడియో ను స్వయంగా వహాబ్‌ రియాజ్‌ తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు, క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఒక మాజీ క్రికెటర్‌ అయి ఉండి.. మాములు వ్యక్తిగా ఇలా చేయడం చాలా గ్రేట్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version