విజయసాయిరెడ్డిని ఇరుకున పడేసిన వీడియో..!

-

దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా భారత్ బంద్ జరుగుతోంది. దాదాపు 21 రాష్ట్ర పార్టీలు రైతు ఆందోళనలో పాలు పంచుకున్నాయి. బంద్ కు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దుతు తెలిపాయి. దీంతో రెండు రాష్ట్రంలో ఉదయం నుంచి అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అయితే ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు మద్దతుగా బంద్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నాయి. గతంలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో ఎలా మద్దతిచ్చారనే విషయంపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ ఎంపీలు టార్గెట్ చేస్తున్నారు.

vijay sai reddy- jagan

ట్విటర్ వేదికగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. ‘‘మతిమరుపు రోగం వచ్చిందా ఏంటి విజయసాయిరెడ్డి. వ్యవసాయ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చింది మర్చిపోయావా..? ఈ బిల్లుని సమర్థించని వాళ్లందరూ దళారులు అంటూ వ్యాఖ్యలు చేసి, రాజ్యసభలో అందరి చేత బూతులు తిట్టించుకుంది మర్చిపోయావా..? టీడీపీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కార్పొరేర్ ఆధిపత్యం, మార్కెట్ల పటిష్టత, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల రైతులు నష్టపోయే అంశాలను స్పష్టంగా వివరించాం. మద్దతు ఇచ్చి.. ఇప్పుడు నాటకాలు ఆడుతారా..?’’ అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ మేరకు టీడీపీ నేత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్.. విజయసాయిరెడ్డి రాజ్యసభలో వ్యవసాయ బిల్లుకి మద్దతు ఇచ్చిన వీడియోని పోస్ట్ చేసి ప్రశ్నించారు. అప్పుడు మద్దతు ఇచ్చి ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version