సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం : మంత్రి ఎర్రబెల్లి

-

కరోనా క్లిష్ట సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రోగరహితంగా ఉంచాలని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అంతేకాకుండా ప‌ది గంట‌ల‌కు, ప‌ది నిమిషాలు కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేప‌ట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పుర‌పాల‌క‌ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. ఈ కార్యక్రమంలో భాగంగా మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు.

errabelli

ఆయన ఆదివారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు. అంతేకాకుండా మొక్కలకు నీళ్లుపట్టారు. ఇంట్లో నీటి నిలువ లేకుండా చేశారు. చెత్తా చెదారం తీసేసి దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం సీజన్‌లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందుచేత పరిసరాలను శుభ్రంగా చుకోవాలన్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చదనం, పరిశుభ్రత, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, స్వచ్చహైదరాబాద్‌, స్వచ్చ తెలంగాణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చే వరకూ ప్రజలు జాగ్రత్తగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version