“బిచ్చగాడు” పాత్రకు మహేష్ బాబు కరెక్ట్ : విజయ్ ఆంథోనీ

-

తమిళ నిర్మాత, దర్శకుడు మరియు హీరో విజయ్ ఆంథోనీ గురించి తెలిసిందే. విజయ్ ఒకే ఒక్క సినిమాతో చాలా ఫేమస్ గా మారిపోయాడు. గతంలో బిచ్చగాడు టైటిల్ తో వచ్చిన సినిమా మదర్ సెంటిమెంట్ తో ఎంతగానో ఆకట్టుకుంది. దీనితో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు సైతం ఇతను సుపరిచితుడు అయిపోయాడు. ఇపుడు బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ అంథోని చేసిన ఒక కామెంట్ వైరల్ గా మారింది. ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూ లో యాంకర్ విజయ్ ను ఈ చిత్రంలో బిచ్చగాడు పాత్రలో మీరు కాకుండా మరో హీరో ఎవరు సూట్ అవుతారో చెప్పుమనగా, విజయ్ ఆంథోనీ ఏ మాత్రం ఆలోచించకుండా టపీమని మహేష్ బాబు అని చెప్పాడు. దీనితో యాంకర్ తో పాటు అక్కడ ఉన్న మిగిలిన మూవీ టీం కూడా షాక్ కు గురయ్యారు.

అయితే ఇందుకు విజయ్ ఇచ్చిన సమాధానం విని ఓకే అనుకున్నారు. ఇందులో నాలాగా ఎమోషన్స్ మరియు సెంటిమెంట్ ఉన్న పాత్రను మహేష్ బాబు మాత్రమే నాయయం చేయగలరు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version