బిచ్చ‌గాడు-2 టైటిల్ లోగో విడుద‌ల..!

-

2016లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బిచ్చ‌గాడు సినిమాకు సీక్వెల్ రాబోతుంద‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుండగా, తాజాగా దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ రోజు విజ‌య్ ఆంటోని బ‌ర్త్ డే కావ‌డంతో చిత్ర టైటిల్ లోగోని విడుద‌ల చేస్తూ బిచ్చ‌గాడు-2‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ప్రియ కృష్ణ స్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బిచ్చ‌గాడు తమిళంలో పాటు తెలుగులో కూడా సంచనల విజయం సాధించింది.

కేవలం రూ. కోటితో రూపాయలతో తెలుగులో విడుదలైన ఈ డబ్బింగ్ చిత్రం ఎవరి అంచనాలకు అందకుండా.. రూ. 20 కోట్ల షేర్ సాధించింది. మరోవైపు టీవీల్లో ప్రసారమైనపు కూడా ఈ సినిమాకు మంచి టీర్పీలే వచ్చాయి. ఈ సీక్వెల్‌లో తెలుగులో ఫేమసైనా కొంత మంది నటీనటులు నటించే అవకాశం ఉందట. మరి బిచ్చగాడు మాదిరిగానే బిచ్చగాడు 2 కూడా ఘన విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version