విజయ్ దేవరకొండ మరియు సమంత ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “ఖుషి”… ఈ సినిమా సెప్టెంబర్ 1న థియేటర్ లలోకి విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన రెండు పాటలు అంచనాలను మరో స్థాయికి తీసుకు వెళ్లాయి. కాగా రెండవ పాట “ఆరాధ్య” అంటూ సాగే సాంగ్ ఇటీవల విడుదల అయింది. ఈ పాట గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు నచ్చిన పాట ఇది. ఈ పాట లో కొత్తగా పెళ్ళైన జంట ఒక సంవత్సర కాలం పాటు ఏ విధంగా తమ జీవితాన్ని గడుపుతారో చూపించాము అని చాలా ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాడు. ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. నాకు ఇంకా పెళ్లి కాలేదు, రానున్న రోజులలో నాకు పెళ్లి అయితే నా జీవితం కూడా ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఎటువంటి జీవితం కావాలో ఆడియన్స్ కు ప్లే క్లూ ఇచ్చాడు విజయ దేవరకొండ.
విజయ్ దేవరకొండ: నా పెళ్లి జీవితం అలాగే ఉండాలి !
-