విజయ్ దేవరకొండ న్యూ మూవీ “ఫ్యామిలీ స్టార్” గ్లిమ్పస్ వీడియో అవుట్ !

-

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో ఎన్ని సినిమా అవకాశాలు తెచ్చి పెట్టిందో మనము చూశాము. కానీ ఆ సినిమాలు అన్నీ చాలా వరకు సక్సెస్ అవ్వడంలో ఫెయిల్ అయ్యాయి అని చెప్పాలి. ఇక ఈ మధ్యన వచ్చిన ఖుషి మూవీ సైతం యావరేజ్ మూవీ గా నిలిచిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను గీతగోవిందం రూపంలో అందించిన డైరెక్టర్ పరుశురాం తో మళ్ళీ జతకట్టి ఒక మంచి ఫామిలీ స్టోరీని అందించడానికి సిద్దమయ్యాడు విజయ్ దేవరకొండ. పరుశురాం, విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ను ఫైనల్ చేశారు. ఇందులో విజయ్ కు జతగా సీతారామం హీరోయిన్ మృణాళిని ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్సె వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ మృణాళిని లు ఒక మధ్యతరగతి భార్యాభర్తలుగా నటిస్తున్నారు.

 

ఈ గ్లిఫ్స్ చూస్తే వరల్డ్ ఫేమస్ లవర్, మజిలీ, జెస్సీ లాంటి సినిమాలలోని సీన్స్ గుర్తుకు వస్తున్నాయి. మరి స్క్రీన్ ప్లే కథలో కొత్తదనంతో పరుశురాం మ్యాజిక్ చేస్తే విజయ్ కు మరో గీతగోవిందం పక్కా.

Read more RELATED
Recommended to you

Exit mobile version