అహమ్మదాబాద్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడిన అనంతరం రోహిత్ శర్మ ఫ్లైట్ లో ముంబైకు చేరుకున్నారు. కానీ ముంబై నుండి పుణెకు మాత్రం తన లాంబోర్గిని కారులో వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్ళాడు. కానీ ఈ స్పోర్ట్స్ కార్ లో ఎక్సప్రెస్స్ హై వే లో రోహిత్ శర్మ 200 నుండి 215 కిలోమిటర్లకు తగ్గకుండా వేగంగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు హై వే లలో అక్కడక్కడా స్పీడ్ ను కొలిచే మీటర్లను అమర్చడంతో ఆటోమెటిక్ గా వాహనాలు వెళ్లే స్పీడ్ ను బట్టి ఫైన్ ను వేయడం జరుగుతుంది. అదే విధంగా రోహిత్ శర్మకు కూడా ఆ హై వే లో అతి వేగంగా ప్రయాణించినందుకు మొత్తం మూడు చలానాలను వేశారట పూణే పోలీసులు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మెడలో వైరల్ గా మారింది.
ఇది చూసిన రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎందుకు బ్రో అంత స్పీడ్ వెళ్లడం కాస్త స్లో గా వెళ్ళండి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. కాగా ఇండియాను వరల్డ్ కప్ లో బ్యాట్ తో మరియు నాయకత్వంతో సమర్థవంతంగా నడిపిస్తూ మూడు విజయాలను అందించాడు రోహిత్ శర్మ.