అందాల క‌శ్మీరాన సామ్ బ‌ర్త్ డే.. స‌ప్రైజ్ .. ఏంటంటే ?

-

శాంకుత‌లం క‌న్నా శివ నిర్వాణ సినిమాలోనే సామ్ బాగుంది. ఆ మాట‌కు వ‌స్తే ఆమె లుక్స్ రివీల్ కాక‌పోయినా కూడా నిన్న‌టి వేళ మైత్రీ మూవీస్ టీం రిలీజ్ చేసిన ఫేక్ వీడియోలో స‌మంత స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అందాల క‌శ్మీరు తీరాన ఈ క‌థ న‌డుస్తోంది. ఓ విధంగా శామ్ కు మ‌రో సారి మ‌జిలీలాంటి అనుభూతినే ఈ సినిమా కూడా ఇవ్వ‌నుంది. సెన్సిబుల్ లవ్ స్టోరీ కావొచ్చు ఈ సినిమా.. అవే మాట‌ల్లో ప్ర‌తిఫ‌లిస్తున్నాయి కూడా !

సమంత, విజయ్ దేవరకొండ కలిసి ఎన్టీఆర్ బయోపిక్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా అంతగా హిట్ అవ్వకపోయినా కూడా వీరి జంటకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరో సారి వీరిద్దరు ఒకే స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా..శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం అందాల కశ్మీరు తీరంలో షూటింగ్ జరుపుకుంటోంది..ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా ఒక అందమైన ప్రేమ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్.

‘మహానటి’ చిత్రంలో విజ‌య్ దేవ‌ర కొండ‌, సామ్ పెయిర్ ఎపీరియెన్స్ , లుక్స్ , ఇంకా యాటిట్యూడ్ ఇవ‌న్నీ ఓ రేంజ్‌లో వర్కౌట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆస‌క్తి నెలకొంది. వాటిని కొన‌సాగిస్తూ శివ నిర్వాణ ఈ మూవీని హ్యాండిల్ చేస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. నిన్న‌టి వేళ అందాల సమంత బర్త్ డే సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ సామ్‌ను అదిరిపోయే రేంజ్‌లో థ్రిల్లింగ్‌గా విషెస్ తెలిపి సర్‌ప్రైజ్ చేశాడు. ఈ సినిమాకు ఒక సంబంధించిన ఓ ఫెక్ సీన్ ను చిత్రీకరించి అది సినిమాలోని సన్నివేశాల్లో ఒకటి అని నమ్మించే ప్రయత్నం చేశారు.. సామ్ ను ! ఆ విధంగా యూనిట్ ఆమె ను స‌ప్రైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను కూడా యూనిట్ విడుద‌ల చేసి ఫ్యాన్స్ ను మ‌రోసారి ఫిదా చేసింది.

ఆ వీడియో క్లిప్ లో ఏముందంటే..

ఈ ఫేక్ సీన్ లో హీరో విజయ్ దేవరకొండ ఓ చోట దిగులుగా కూర్చొని ఉన్నాడు..విజయ్ దగ్గరకు సమంత వచ్చి.. ‘ఏమైంది? ఎందుకిలా ఉన్నావ్? నేను వెళ్ళిపోతున్నాననా? నువ్వొచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడడం కాదు. నేనే మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్ళికి ఒప్పిస్తాను..’ అని విజయ్ ను చూస్తూ, ఇటు చూడు అని చెబుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. విజయ్, సమంత కళ్ళని తుడిచి సమంత అని పిలిచి, హ్యాపీ బర్త్ డే అని విష్ చేశాడు. సమంతా ఎంతో థ్రిల్లయిపోయింది. సినిమా టీమ్ హ్యాపీ బర్త్ డే సమంతా అని విషెస్ చెప్పారు. ఈ ఫేక్ సీన్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.. మీరు ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version