గుంటూరు: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

-

గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడికి ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది.గత ఏడాది 15 న జరిగిన ఈ ఘటన పై తొమ్మిది నెలల పాటు విచారణ జరిగ్గా..దోషికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేకక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.ఈ కేసులో మొత్తం 26 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.రమ్యకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన నిందితుడు శశి కృష్ణ ప్రేమ పేరుతో వేధించాడు.తన ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందన్న కోపంతో గత ఏడాది ఆగస్టు 15న నడిరోడ్డు పైన అందరూ చూస్తుండగా రమ్య ను కత్తితో పొడిచి హత్య చేశాడు.

సీసీ కెమెరాల్లో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా నిందితుడిని 24 గంటల లోపే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు 36 మందిని విచారించి 15 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రామ్ గోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు.హత్య కేసులో కీలకమైన సీసీటీవీ వీడియో ని పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం..ఈరోజు ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పును ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version