ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న తరుణంలో దేశంలో కూడా ఈ వ్యాధి ప్రభావం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ ప్రకటించారు.
మరోపక్క వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు అప్పట్లో రాజధాని బిల్లు విషయంలో శాసనమండలిలో విజయసాయిరెడ్డి ఓవర్ థింక్ చేసి పీకల దాకా తీసుకు వచ్చాడు, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అప్పగించిన పార్టీ నిండా ముంచే విధంగా రమేష్ కుమార్ ని గుర్తించలేకపోయాడు మొత్తంమీద చూసుకుంటే పిచ్చి పనులు చేసి జగన్ ని విజయ సాయి రెడ్డి బ్యాడ్ చేస్తున్నారని లోలోపల గుసగుసలాడుతున్నారు. ఎన్నికల వాయిదా అనివార్యమైతే ఖచ్చితంగా ఐదువేల కోట్లు రాష్ట్రం నష్టపోతుంది అని వైసీపీ నేతలు బాధపడుతున్నారు.