టాలీవుడ్లో ఓ సంచలనం విజయ్ దేవరకొండ(vijay devarakonda). చాలా తక్కువ టైమ్‌లోనే విపరీతంగా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఈ సెన్సేషనల్ స్టార్. ఎవరికీ సాధ్యం కాని ప్రయోగాలు చేస్తూ ఎక్కడా లేనంత ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. ఫాలోయింగ్ విషయంలో ఇప్పటికే ఎంతో మంది స్టార్లను వెనక్కు నెట్టి దూసుకుపోతున్న విజయ్ ఇప్పుడు మరో వండర్ క్రియేట్ చేశాడు.
రీసెంట్ గా ఆయన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో కలిసి ప్యాన్ సినిమా అయిన లైగర్‌లో చేస్తున్నాడు విజయ్. ఈ మూవీ ఇప్పుడు కరోనాతో కాస్త బ్రేక్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు విజయ్.
అయితే ఆయన తన కొత్తలుక్‌ను అభిమానులకు పరిచయం చేస్తూ దిగిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటో దుమ్ము లేపుతోంది. ఇందులో ఆయన బుల్లెట్ బైక్ పక్కన కూర్చొని యమ మాస్ అండ్ స్టైల్ గా దిగారు. ఇందులో ఆయన జీన్ ప్యాంట్ అండ్ బనియన్‌లో భారీగా పెంచేసిన కండలు అలాగే పొడవాటి జుంపాల జుట్టుతో అచ్చం హృతిక్ రోషన్లాగే కనిపిస్తున్నాడు. ఇప్పుడు బాలీవుడ్లో కండలు, ఫిజిక్ ఉన్న వారికి మంచి గుర్తింపు, ఫాలోయింగ్ ఉండటంతో ఆయన ఈ కొత్త లుక్‌తో లైగర్ ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రి ఇస్తున్నాడు.