2024 నుంచి రాజకీయాల్లో చంద్రబాబు కనిపించరు : విజయసాయిరెడ్డి

-

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆయనకు 7691 నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వియసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7 6 9 1 = 23. చంద్రబాబు గారూ… మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు’ అని ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రబాబు జైలుకు వెళ్లడంపై వైసీపీ మంత్రులు, నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

గతంలో వైసీపీకి చెందిన 23 మందిని ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని…2019 ఎన్నికల్లో ఆ 23 మందికే పరిమితం అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఖైదీ నంబర్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తేదీలు పరిశీలించిన 23 వస్తుందని చంద్రబాబును ఈ 23 వదలదంట సెటైర్లు వేస్తున్నారు. మంత్రి రోజా టపాసులు కాల్చి, కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళి అర్పించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version