సిఎం వైఎస్ జగన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. సిఎం జగన్ కి తనకు మధ్య ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేసారు. అసలు విజయసాయి రెడ్డి ఏమన్నారు అంటే… తాను చనిపోయేవరకు సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేసారు.
తనను శంకించాల్సిన పనిలేదన్న ఆయన… తనకు, మా అధ్యక్షుడు జగన్‌కి ఎలాంటి విభేదాలు లేవు..రావని ఆయన ధీమా వ్యక్తం చేసారు. అదే విధంగా హైకోర్ట్ గురించి మాట్లాడుతూ న్యాయవ్యవస్థని కించపరిచే ఉద్దేశంగానీ.. అగౌరవపరిచే ఉద్దేశం ఏ ఒక్క వైసీపీ కార్యకర్తకు లేదని స్పష్టం చేసారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డగోలుగా పెట్టిన పోస్టులకు.. కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఉంటే ఎన్ని జైళ్లు అయినా సరిపోవన్నారు.
అలాగని తాము న్యాయవ్యవస్థను కించపరచడం లేదన్నారు. హైకోర్టును గౌరవిస్తున్నామని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమారే ఎస్‌ఈసీగా ఉండాలని టీడీపీ కోర్టుకు వెళ్లడం ఏంటి? అని విజయసాయి నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం లేకున్నా..వాళ్ల మనుషులే ఉండాలనుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంపై విషం కక్కారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన రాసిన లేఖ టీడీపీ ఆఫీస్ లో తయారు చేసారని అన్నారు.