కీర్తి సురేష్ అందుకు సై అంటుందా ..?

-

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి టాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలు ఒక రకమైన క్రేజ్ ని తీసుకు వస్తే మహానటి సినిమా సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు నార్త్ లో కూడా గుర్తింపు వచ్చేలా చేసింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో కాస్త గ్యాప్ తీసుకున్న కీర్తి కోలీవుడ్ లో మాత్రం వరసగా విక్రం, విజయ్, ధనుష్ లాంటి యంగ్ హీరోల సరసన నటిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ లోను కీర్తి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం తన చేతిలో 6 సినిమాలున్నాయి. వాటిలో తెలుగులో ‘రంగ్ దే’.. ‘గుడ్ లక్ సఖి’, తమిళంలో ‘అన్నాతే’.. ‘పెంగ్విన్’.. ‘మిస్ ఇండియా’ కాగా ఒక బాలీవుడ్ సినిమా.

 

ఇక కీర్తి సురేష్ ఈ మద్య బాగా స్లిం గా తయారైంది. ఇలా స్లిం అయిన ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కీర్తి చాలా బావుందంటూ చెప్పుకుంటున్నారు. అయితే తను ఇలా స్లిం గా తయారైంది లిప్పు లాకులకు.. బికినీలకు రెడీ అవుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో కీర్తి క్లారిటీ ఇచ్చింది.

నాకు బోల్డ్ గా ఉండే పాత్రలు.. లిప్ లాక్ సీన్స్ లో నటించడం నచ్చదని ప్రేక్షకులు కూడా తనని అలాంటి పాత్రల్లో చ్చుడటానికి ఇష్టపడరని తెలిపింది. ‘మహానటి’ తెచ్చిన పాపులారిటీ తో నా నుంచి మంచి పాత్రలు ఆశిస్తున్నారని వాళ్ళు నచ్చే పాత్రల్లోనే నటిస్తానని తెలిపింది కీర్తి సురేష్. ఇక కీర్తి సురేష్ నటించిన తెలుగు తమిళ సినిమా పెంగ్విన్ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version