ఎక్కడ శవం దొరుకుతుందా అని రాబందులా తిరుగుతున్నారు : విజయసాయిరెడ్డి

-

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీఎం ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో ‘2016లో అకాల వర్షాలకు 19 మంది మృతి. 2017లో భారీ వర్షాలకు 31 మంది దుర్మరణం. తిత్లీ తుఫానుకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు భారీ వరదలకు ప్రాణనష్టం లేదు. అందుకే ఎక్కడ శవం దొరుకుతుందా అని రాబందులా తిరుగుతున్నారు టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడు మా బాబు.’ అంటూ మండిపడ్డారు. అంతకు ముందు.. ‘బాబన్నయ్యా! సంపాదించిన దాంట్లో కుటుంబ సభ్యులకు వాటా ఇవ్వలేదు. రాష్ట్రానికి న్యాయం చేయలేదు. సీఎంగా 2016-18లో సరాసరి 7.6%, 2018-19లో 8.3% వడ్డీతో అప్పులు తెచ్చావు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2020-21లో కేవలం 6.5% వడ్డీకే రుణాలు సేకరించిందని ఆర్‌బీఐ నివేదిక చెబుతోంది. ఏంటన్నయ్య ఇదంతా!’ మా పెద్దన్న చంద్రబాబు అసలు రంగు, రూపం ఇది! అధికారంలో ఉంటే రక్తం తాగే రాక్షసుడు… ప్రతిపక్షంలో ఉంటే సానుభూతి కోసం డ్రామాలు..గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు – బోయపాటి షూటింగులో 30 మంది చనిపోతే ఆయన స్పందన మీరే వినండి. ఆల్జీమర్స్ తో నువ్వు మర్చిపోయినా కర్మ వదలదు బాబన్నా.’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version