బొచ్చు పీకిన బ్రాయిలర్ కోడివి..నువ్వేం పీకుతావు – లోకేష్‌పై విజయసాయి సెటైర్‌

-

టీడీపీ ఎమ్మెల్సీ, కీలక నేత నారా లోకేష్‌ పై మరోసారి తన స్టైల్‌ లో సెటైర్లు పేల్చారు వైసీపీ నేత, రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి. బొచ్చు పీకిన బ్రాయిలర్ కోడివి..నువ్వేం పీకుతావంటూ లోకేష్‌పై విజయసాయి ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. పప్పూ!…నువ్వే ఒక బొచ్చు పీకిన బ్రాయిలర్ కోడిలాంటివాడివని… నువ్వు మళ్ళీ ఈకలు పీకుతానంటూ మూర్ఖుడిలా మాట్లాడుతున్నావంటూ మండిపడ్డారు.

ysrcp mp vijayasai reddy

దుష్టులు, దుర్మార్గులు కలిసినా నా తల వెంట్రుక కూడా పీకలేరని సీఎం గారు అంటే అది నీకూ, మీ పచ్చ’కుల’ మీడియాకి మింగుడుపడటం లేదా? అంటూ నిప్పులు చెరిగారు. పేదలకు ఇళ్లు ఇస్తే కేసులు వేయిస్తారని… ఉపాధి హామీ పథకానికి నిధులివొద్దంటూ ఢిల్లీలో లాబీయింగ్ అంటూ ఫైర్‌ అయ్యారు విజయసాయిరెడ్డి. నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు పెట్టినా వీల్లేదంటూ లేఖలు రాస్తారని.. ఏదైనా ఆపగలిగారా? వెంట్రుకయినా పీకగలిగారా? ఏం బతుకులు మీవి? రెండేళ్లలో రాష్ట్రానికి పట్టిన పప్పు, తుప్పు వదిలిపోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version