ఢిల్లీలో బీఆరెస్‌ని పట్టించుకునే నాథుడే లేడoటూ విజయశాంతి చురకలు అంటించారు. బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చేసిన హడావుడి తుస్సుమంది. యూపీ, కర్ణాటకల మాజీ సీఎంలు అఖిలేష్, కుమారస్వామి తప్ప ఎన్సీపీ, జేడీ(యూ), ఆమ్ ఆద్మీ, తృణముల్, డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీల నాయకులెవరూ అక్కడ కనిపించలేదని ఏద్దేవా చేశారు.
బీఆరెస్ వర్గాలు ఏకంగా ఐదు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసినా జాతీయ మీడియా గాని, రాజకీయ వర్గాలు గాని ఈ పార్టీ ఊసెత్తితే ఒట్టు. తెలుగు మీడియా తప్ప చివరికి సోషల్ మీడియా కూడా బీఆరెస్‌ని పట్టించుకోలేదు. గతంలో పలుమార్లు కేసీఆర్ గారిని కలిసిన రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ కూడా ముఖం చాటేశారు. నిజంగా దేశానికి సేవ చేయాలనే భావంతో ప్రజల్లోకి వెళితే ఆదరణ వస్తుంది తప్ప… అధికార దాహం, స్వార్థప్రయోజనాల కోసం పార్టీ పేరు మార్చి యాగాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని బీఆరెస్ అధినేత గ్రహించాలన్నారు విజయశాంతి.