కారులో హత్య కేసు అప్డేట్..!

-

విజయవాడ కారులో హత్య కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయట పడ్డాయి. పక్కా పథకం ప్రకారం రాహుల్ ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు కోరాడ విజయ్ ఆయన భార్య పద్మజ మరో యువతి గాయత్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరులో విజయ్ తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హైదరాబాద్, విశాఖ, బెంగళూరులో ప్రత్యేక బృందాలు విజయ్ కోసం గాలిస్తున్నాయి.

కోరాడ విజయ్ అనుచరులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అలాగే కోగంటి సత్యం కదలికల పైనా పోలీసులు నిఘా పెట్టారు. హత్య చేయబడ్డ రాహుల్ మరియు హత్య చేసిన విజయ్ సన్నిహిత కుటుంబాలని దర్యాప్తులో తేలింది. జిక్సిన్ కంపెనీలో విజయ్ పెట్టుబడులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోరాడ విజయ్ పెట్టుబడి పెట్టారా లేక రాహుల్ కు అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చడా అని విచారిస్తున్నారు. రాహుల్ తండ్రి కోగంటి సత్యం పేరు ప్రస్తావించినా అతనికి పోలీసులు నోటీసు ఇవ్వలేదు. కేసును లోతుగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version