ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవుతున్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఇబ్బంది పడుతుది. పోలీసు అధికారులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ పై సీరియస్ గా దృష్టి పెట్టింది అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో… కర్ఫ్యూని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం `12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
ఈ నేపధ్యంలో విజయవాడ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నేటి నుంచి విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కర్ఫ్యూ మరింత కట్టుదిట్టం చేస్తామని అన్నారు. చిన్న చిన్న కారణాలతో రోడ్డుపైకి వాహనాలతో వస్తే వాహనం సీజ్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. అత్యవసర పనులు మినహా ఇతరులెవరైనా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవు అని సీపీ వార్నింగ్ ఇచ్చారు.