కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. రోజుకి లక్షల కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సప్లై కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులని కూడా పంపిణీ చేస్తున్నారు. వ్యాక్సిన్ కొరత కూడా మనం చూశాం అయితే వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకునేవాళ్ళు ఆన్లైన్లో ఈ ప్లాట్ ఫామ్స్ ద్వారా స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు.
పేటీఎం వ్యాక్సిన్ ఫైండర్:
పేటీఎం తాజాగా వ్యాక్సిన్ కి సంబంధించి వివరాలు ఇచ్చింది. పేటీఎం వ్యాక్సిన్ కోసం ఒక ఆప్ ని తయారుచేసింది. మీరు అక్కడ వ్యాక్సిన్ సెంటర్ కోసం చూడొచ్చు. ఒకవేళ కనుక వ్యాక్సిన్ అక్కడ లేదు అంటే మీరు నోటిఫై మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు మెసేజ్ వస్తుంది.
వ్యాక్సీనేట్ మీ:
ఇది కూడా ఒక ఆప్. ఇక్కడ మీరు మీ పిన్ కోడ్ మరియు జిల్లా పేరు ఎంటర్ చేసిన తర్వాత స్లాట్ చూడొచ్చు. ఇలా మీరు వాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
కోవిన్ ప్లాట్ఫామ్:
దీనిలో కూడా మీరు వాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు దీనికి తాలూక సమాచారాన్ని చూడొచ్చు. ఇలా స్లాట్ బుక్ చెయ్యచ్చు.
గెట్ జాబ్:
గెట్ జాబ్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. డేటా కూడా ఇతరులకు షేర్ చేయరు చాలా సీక్రెట్ గా ఉంటుంది.
whatsapp my gov హెల్ప్ డెస్క్:
వాట్సాప్ కూడా సహాయం చేస్తోంది. whatsapp my gov హెల్ప్ డెస్క్ మార్చి 2020 న లాంచ్ అయ్యింది. ఇది కూడా మీకు వాక్సిన్ ప్లాట్ ఫామ్ ని బుక్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అయితే దీని కోసం 9013151515 ఈ నెంబర్ ని సేవ్ చేసుకుని ఇది లాంచ్ అయిన తర్వాత మీరు హలో చెప్తే ఆటోమేటిక్ గా మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ డీటెయిల్స్ ఇది ఇస్తుంది.