వికారాబాద్ కిడ్నాప్ కేసు.. భర్తే కిడ్నాప్ చేశాడా ?

-

నిన్న వికారాబాద్ లో యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కిడ్నాప్ కేసులో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అయితే సదరు యువతిని భర్తే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వికారాబాద్ ఎమ్మార్పి చౌరస్తా సమీపంలో అక్కా చెల్లెళ్ళు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చెల్లిని కారులోకి లాక్కొని అక్కడి నుండి పారిపోయారు. సదరు యువతి వికారాబాద్ కు చెందిన ఓ మెడికల్ షాపు యాజమాని కూతురు అని తెలుస్తోంది.

చెల్లి కిడ్నాప్ కావడంతో అక్క షాక్ కి గురయింది. కిడ్నాప్ కేసు కావడంతో పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు అందులో అక్క చెల్లెలు షాపింగ్ కు వెళ్లి వస్తుండగా కారులో వచ్చి చెల్లి దీపికాను దుండగులు కిడ్నాప్ చేశారు. అంబికా వస్త్ర దుకాణం సమీపంలో దీపిక కిడ్నాప్ కు గురైనది. NTR చౌరస్తా నుంచి అనంతగిరి వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే 2016లో దీపికాకు అఖిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య భర్త వేరుగా ఉంటున్నారు. రెండు రోజులు క్రితమే విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లి వచ్చింది దీపికా. భర్త అఖిల్ కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన పోలీసులు, అతని కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version