నేడు ఉదయం గ్యాంగ్ స్టార్ వికాస్ దుబె ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ లో హతమార్చిన సంగతి అందరికి విదితమే. నిన్న ఉదయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఆలయంలో వికాస్ దూబె పోలీసులకు దొరికాడు. ఇక అతని తరలిస్తున్న సమయంలో కాన్వాయ్ లో ఒక కారు కాన్పూర్ ప్రాంతంలో నేడు ఉదయం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఇదే అవకాశంగా అనుకున్న దూబే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమై అతనిపై కాల్పులు జరపడంతో దూబే అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని కాన్పూర్ ఆసుపత్రికి పోలీస్ అధికారులు తరలించారు.
Vikas
ఇక ఈ తరుణంలో వికాస్ దూబె మృతదేహానికి వైద్య అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్ అతనికి నెగిటివ్ గా వచ్చింది. కాన్పూర్ ఆస్పత్రిలో దుబే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇక వికాస్ దుబే శరీరంలో మొత్తం నాలుగు బులెట్లు ఉన్నాయని వైద్య అధికారులు తెలియజేశారు. ఇటీవల బిక్రు గ్రామంలో జరిపిన కాల్పులలో డిఎస్పి దేవేందర్ మిశ్రా తో పాటు ముగ్గురు ఎస్సైలు మొత్తం నలుగురు మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పటివరకు వికాస్ పై బీజేపీ ఎమ్మెల్యే హత్యతో సహా 60 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అర్థమవుతోంది.