చీమలకు భయపడి ఊర్లకు ఊర్లే ఖాళీ చేస్తున్నారు..?

-

ఊర్లో వైరస్‌ వచ్చిందనో, పొలాలు పండటం లేదనో, ఆఖరికి దెయ్యాలు ఉన్నాయనో ఊరు ఖాళీ చేసి వెళ్తారు. కానీ చీమలు ఉన్నాయని ఎవరైనా వెళ్తారా..? కానీ., అక్కడ వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఆ చీమలు ఒకటి రెండు కాదు..లక్షల్లో ఉన్నాయి.. చీమ గారి దండయాత్రకు భయపడి జనాలు వెళ్లిపోతున్నారు. తమినళాట ప్రజల చీమల కష్టాలపై మీరు ఓ లుక్కేయండి.!

తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్టు సమీప‌ గ్రామాల్లోని ప్రజలను చీమలు బెంబేలెత్తిస్తున్నాయి. గత కొంత‌ కాలంగా చీమలు అటవీ ప్రాంతాన్ని వదిలి గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా ఏది దొరికితే దానిని తినేస్తున్నాయి..రైతులకు చెందిన మేకలు, పశువులు, ఎద్దులకు హాని చేయడంతో పాటుగా, ఎలుకలు, పిల్లులు, కుందేళ్లలపై దాడి చేసి వాటి చంపేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో ఎల్లో క్రేజీ చీమలు గ్రామాల్లో వస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వీటివల్ల పశువులు కళ్లుపోయి అంధకారంలోకి వెళ్తుంటే.. మరికొన్ని చనిపోతున్నాయి. పది సెకండ్లు నుల్చుంటే చాలు.. మనుషుల మీదకు కూడా ఎక్కేస్తాయి. ఇవి కుట్టవు కానీ పార్మిక్‌ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. ఇలా ఫార్మిక్ యాసిడ్‌ను విడుదల చేయడం ద్వారా మనిషి శరీరంపై దురదలు, చర్మం పొట్టులా రాలడం జరుగుతుంది.. పశువుల కంట్లో ఈ చీమలు పడితే పూర్తిగా చూపు కనిపించకుండా పోతుంది. అటవీ సమీప గ్రామాల ప్రజలు చీమల దండుకు భయపడి ఊళ్లను ఖాళీ చేస్తున్నారు. చీమల నివారణకు అనేక మందులు ఉపయోగించినా ఏమాత్రం వాటిపై ఫలితం చూపలేకపోతుండడంతో స్థానికులు అంటున్నారు.

శాస్త్రవేత్తలు ఏం అంటున్నారు..

అటవీ ప్రాంతంలోని చీమల నమూనాలను సేకరించి పరిశోధనకు పంపడంతో పాటు, వీటి నైజంను పరిశీలించారు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ప్రపంచంలోని తొలి 100 ప్రమాదకరజాతుల్లో వీటిని చేర్చారని పర్యావరణవేత్త వైల్డ్ లైఫ్ పరిశోధకులు తెలిపారు. గతంలో ఈ చీమలు ఆస్ట్రేలియాలోని క్రిసమస్‌ ఐలాండ్‌లోకి అడుగుపెట్టి అక్కడున్న లక్షలాది పీతలను తినేశాయి. అప్పుడు హెలీకాఫ్టర్ల ద్వారా మందులు పిచికారీ చేసి వాటిని నిర్మూలించగలిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version