ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు లో టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ.. జిల్లాలో ఏ కోటరీ లేదని.. కార్యకర్తలే పార్టీకి గుండెకాయ అని అన్నారు. తెలంగాణలో పల్లెలు అభివృద్ధి చెందాయి అంటే అది కేసీఆర్ వల్లే అన్నారు నామా. భారతదేశం మొత్తానికి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బయట పార్టీలను ఎదుర్కోవాలంటే మనందరం కలిసి పని చేయాలన్నారు.
అలాగే ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. కార్యకర్తలు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికి పడితే వారికి జేజేలు కొట్టకండని సూచించారు. లింగాల కమల్ రాజు ఓడిపోయినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కమల్ రాజును జడ్పీ చైర్మన్ చేశారని తెలిపారు. కోటరీ మాటలు వినకండని.. ఆత్మ విమర్శ చేసుకొని పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని అన్ని స్థానాలలో గెలిపించి కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు.