షణ్ముక్ ఎవర్నో బ్యాన్ చేయాలని అంటున్నాడు! ఆమె మీకు తెలుసా.!

-

షణ్ముక్ జశ్వంత్ అంటే సోషల్ మీడియాలో పరిచయం లేని వారు ఏవరూ ఉండరు. తనకు సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ లో విపరీతమైన క్రేజ్ వుంది. ఈ క్రేజ్ చూసి బిగ్ బాస్ షో వారు ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ 5వ సీజన్ కు తీసుకొని వచ్చారు. అప్పటికే షన్ను తన కో స్టార్ అయిన దీప్తి సునయన తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. తన ఎంకరేజ్ తో అతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.

shanmuk jashwanth

ఇక అక్కడకి వెళ్ళిన తర్వాత, అక్కడ మరో హౌస్ మేట్ అయిన సిరి తో పులిహోర కలపడం స్టార్ట్ చేసాడు. ఇక వీరు హద్దులు దాటి హగ్గులు, పెదవి ముద్దులు వరకు వెళ్ళిపోయారు. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో హంగామా గా మారింది. దీప్తి సునయన తో మంచి ప్రేమ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా అతడు మర్చిపోయి దొరికింది కదా అని బిగ్ బాస్ హౌస్ లో రెచ్చిపోయాడు. దీన్ని చూసి దీప్తి చీ కొట్టి విడిపోయింది. ఇక షన్ను కూడా ఏదో బలహీన క్షణంలో జరిగింది అన్నా కూడా ఆమె కనికరించలేదు.

దానితో షణ్ముక్ జశ్వంత్ నాకేం తక్కువ అని తన స్టయిల్ లో ఎంజాయ్ చేస్తూ ఫాలోయర్స్ ను పెంచుకుంటూ పోతున్నాడు. ఇక తన గర్ల్ ఫ్రెండ్ మీద కసి తీర్చుకోవడానికా అన్నట్లుగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్టు పెట్టినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అందులో.. ఎలా అయితే రూ.500, రూ.1000 నోట్లను బ్యాన్ చేశారో.. అలాగే ప్రతి మన గర్ల్స్ ఫ్రెండ్స్ లైఫ్ లో రెవి అనే క్యారెక్టర్ ను బ్యాన్ చేయాలి అని స్టోరీ పెట్టాడు. ఈ రెవి ఎవరు మనోడుకి ఈమెకు ఏంటి సంబంధం అని సోషల్ మీడియాలో కొత్త ప్రశ్నలు లేవనెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version