పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన తనకు ఎలాంటి సపోర్టు దొరికిందో చెప్పలేనని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అసహనం వ్యక్తం చేశారు.అక్కడ చాలా రాజకీయాలు జరిగాయని విమర్శించారు. భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష తనను పరామర్శించడానికి వచ్చిందని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోపై ఆమె తాజాగా స్పందించారు.
ఆరోజు జరిగినదంతా ఓ నాటకమని, పీటీ ఉష కేవలం ఫొటోలు దిగేందుకే వచ్చారని ఆరోపించారు. తనకు తెలియకుండానే ఫొటో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారని ఫైర్ అయ్యారు.అనర్హత వేటు పడినప్పుడు తాము కూడా మద్దతుగా ఉన్నామని చెప్పుకునేందుకే పీటీ ఉష తన దగ్గరికి వచ్చారని వినేశ్ చెప్పుకొచ్చారు.
అయితే, పారిస్ ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన వినేశ్ భవిష్యత్‌లో తిరిగి రెజ్లింగ్‌కు వచ్చే విషయంపై పునరాలోచిస్తానని ప్రకటించారు. ఇదిలాఉండగా, వినేశ్ ఫొగాట్ తాజాగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.