Viral: రామ కోటి రాస్తున్న వానరం..చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

సోషల్ మీడియాలో రోజులో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ వస్తుంటాయి.. అందులో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి… తాజాగా మరో వీడియో లో ఓ కోతి రామ్ అని రాస్తుంది.. ప్రస్తుతం అది వైరల్ కావడంతో జనాలు ఆశ్చర్య పోతున్నారు. రామభక్తుడు హనుమంతుడిగా పూజనీయంగా భావిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కోతి వీడియో విపరీతంగా చక్కర్లు అవుతోంది.

ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం తో ముక్కున వేలేసుకుంటున్నారు. రామ భక్తిని చూసి పరవశించి పోతారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..ఒక కోతి వేరుశెనగ కాయలతో ‘రామ్’ అనే పేరు రాస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు కోతులకు చదవడం, రాయడం తెలియదని, మరి ఈ కోతి ‘రామ్‌’ అని ఎలా రాస్తోందో ఈ దృశ్యాన్ని చూసి జనాలు షాక్ అవుతున్నారు.

ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు దీనిని ఒక అద్భుతంగా పరిగణిస్తున్నారు. కానీ, వాస్తవానికి ఇక్కడ జరిగిన నిజం మరొకటి ఉంది. అది తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా విస్తుపోతారు.కోతి ‘రామ్’ అనే పేరు రాయడం లేదని, అయితే అప్పటికే ‘రామ్’ అనే పేరు రాసి ఉందని, కోతి ఆ వేరుశెనగలను ఒక్కొక్కటిగా తొలగిస్తోందని తెలిసి వినియోగదారులు వాపోతున్నారు.. ఏది ఏమైనా అక్కడ చూడటానికి కోతి రాస్తున్నట్లు ఉంది.. ఇది రామ భక్తులను తెగ ఆకర్షిస్తుంది.. కేవలం 39 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 24 వేలకు పైగా వీక్షించగా, 4 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్లు చేస్తూన్నారు.. మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version