ఉద్యోగ ప్రకటన తెలిపిన ఓ ప్రముఖ బ్యాంక్ నిబంధనలు వైరల్ అయ్యాయి. దీంతో ఇది సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యింది. ఆ జాబ్ సర్కులర్‌లో ఉన్న కండీషన్ చూసి అంతా విస్తుపోతున్నారు. అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు లె లుసుకుందాం. ఇటీవల తమిళనాడులో బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్‌ల నియామకం కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇందులో 2021 ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు కాదు అంటూ అందులో పేర్కొంది.
అస్సలు అభ్యర్థులు కొవిడ్ నేపథ్యంలోనే పరీక్షలు రాయలేని దుస్థితి ఏర్పడింది. ఇక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కొన్ని నిబంధనల మేరా పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఓ జాబ్ సర్కులర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే.. కొవిడ్ కాలంలో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అనర్హులంటూ అందులో పేర్కొన్నారు. అంటే 2021లో ఎగ్జామ్స్ రాయకుండా పాసైనవారు ఈ ఉద్యోగాలకు అనర్హులు అని అర్థం. డిగ్రీ క్వాలిఫికేషన్ తో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్‌డీఎఫ్‌సీ అందులో నుంచి 2021 పాస్ అవుట్ బ్యాచ్ అనార్హులని చేసింది. అయితే..దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చి.. వివాదానికి దారి తీయడంతో హెచ్‌డీఎఫ్‌సీ యాజమాన్యం స్పందించింది.
అది అక్షర దోషమని వివరణ ఇచ్చింది. ప్రకటనలో తప్పు వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు అని, పాస్ అయిన సంవత్సరంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తప్పును సరిదిద్దడానికి ప్రకటనను ఇచ్చామని చెప్పింది. అయితే, నెటిజన్లు మాత్రం ఈ వైరల్ జాబ్ నోటిఫికేషన్‌ను తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పరీక్షలు లేకుండా పాసై కరోనా బ్యాచ్‌గా ముద్రవేయించుకున్న విద్యార్థులు ఎందుకూ పనికిరాకుండా పోతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని వాపోయారు. ఇక వీటిపై విపరీతంగా మీమ్స్ కూడా వచ్చేశాయి.