వైసీపీలో కొత్త చర్చమొదలైంది. ఏపీలో అధికార పార్టీకి ఎవరైనా శత్రువు ఉంటే.. అది పార్టీల రూపంలోను, ప్రత్యర్థుల రూపంలో ఉన్నారని నాయకులు భావిస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు చిత్రంగా వైసీపీ అధినేత జగన్‌కు మిత్రుడు రూపంలోనే శత్రువు ఉన్నారంటూ.. తెలియడంతో అందరూ చిత్రంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే, ఆయన క్యారెక్టర్ మంచిది కాదని, అప్పటి వరకు సాయం చేస్తున్నట్టుగా కనిపించినా.. కూడా తర్వాత వారి వారి లోతుపాతులు గ్రహించి బయటపెట్టే లక్షణం ఉన్నదని తాజాగా ఓ కాలమ్‌లో అభిప్రాయం వ్యక్తమైంది.
నిజానికి ఇది ఒక మైండ్ గేమ్. వైసీపీలో అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే.. రాజకీయాలతో సంబంధం లేని ఫీల్డ్ నుంచి వచ్చి పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్న విజయసాయిరెడ్డి, జగన్‌లదే. అయితే, ఇప్పుడు వీరి మధ్య ఏదో ఒక రకంగా మనస్పర్థలు, చిచ్చు పెట్టగలిగితే.. అంతా సక్సెస్ అయినట్టేనని అనుకుంటున్న ప్రత్యర్థులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారే.. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని రాయించారని చెబుతున్నారు. అంటే.. జగన్ దగ్గర చాన్నాళ్లుగా ఆడిటర్‌గా పనిచేసిన సాయిరెడ్డికి జగన్ వ్యాపార రహస్యాలు తెలుసు కాబట్టి.. రేపెప్పుడైనా సాయిరెడ్డి యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని ఈ కాలమ్ అభిప్రాయపడింది.
నిజానికి ఇలా కూడా జరుగుతుందా? అంటే.. గతంలో ఈ కాలమ్ రాసిన వ్యక్తి సమర్ధించిన ఓ పార్టీలో ఇలా నే వెన్నుపోటు రాజకీయాలు సాగాయి. అంటే.. సదరు పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు ఒకరు ఆ పార్టీ ని హస్తగతం చేసుకునేందుకు తనకు తెలిసిన అన్ని వీక్‌నెస్‌లను ప్రయోగించాడు. ఇప్పుడు వైసీపీలోనూ ఇలానే జరుగుతుందని ఈయన భావించడం ఆ కోవలోకే వస్తుంది. అయితే, అంత వీక్‌గా ఏమీ వైసీపీ లేద నేది వాస్తవం.
ఒక నాయకుడు బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి జగన్ కానీ, ఆయన పార్టీకానీ దిగజారిపోయే లక్ష ణం లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు, పార్టీని ఆది నుంచి వ్యూహాత్మకంగా ముందుకు సాగిస్తున్న సాయిరెడ్డిని కేంద్రంగా చేసుకున్న ఇదొక మైండ్ గేమేనని అంటున్నారు. మరి ఏదేమైనా ప్రస్తుత పరిణామాలు వైసీపీలో గందరగోళం సృష్టించేందుకేనని అంటున్నారు.