వైర‌ల్ పిక్ : సింహం ద‌ర్జా అంటే ఇదేనేమో..!

-

అడవికి రాజు సింహం. అలాంటి సింహాన్ని చూస్తేనే చాలా మందిలో వణకు పుడుతుంది. ఇంకా ఆ సింహం దగ్గరికి వెళ్లాలంటే వారు భయపడి చస్తారు. కానీ వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్లు మాత్రం అలా కాదు. వారు సింహాలను దగ్గరి నుంచి ఫొటోలు తీస్తారు. వాటి వివిధ హావభావాలను తమ కెమెరాల్లో బంధించి మనకు ఛాయాచిత్రాలుగా చూపిస్తూ… ఉంటారు. చాలా మంది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు చాలా రోజుల పాటు కష్టపడి జంతువుల జాడను గుర్తించి వాటి హావభావాలను ఫొటోలుగా బందిస్తూ ఉంటారు. తాము తినకపోయినా పరవాలేదు కానీ అందమైన జంతువుల చిత్రాలను తీసేందుకు వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.


ఈ ఫోటో చూస్తుంటే.. పెయింటింగ్‌లా క‌నిపింస్తుంది క‌దా.. ఇది పెయింటింగ్ కాదు అంటే ఏ సినిమా కోసం తీసిన స్టిల్ అని అడుగుతారేమో.. అది స్టిల్ ఫోటో కూడా కాదండోయ్.. వైల్డ్‌లైఫ్ ఫోటో గ్రాఫ‌ర్ క్లిక్‌మ‌నిపించిన ఫోటో.. దక్షిణాఫ్రికాలోని జీజీ కన్జర్వేషన్‌ వైల్డ్‌ లైఫ్‌ రిజర్వులో ఉన్న సింహాన్ని సిమోన్‌నీహాం అనే ఫొటోగ్రాఫర్‌ అందంగా ఫొటో తీశాడు. కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఆ ప్రదేశంలో ఉన్న సింహాన్ని చూసి ఏ మాత్రం బెదిరిపోకుండా సిమోన్ చూడచక్కని ఫొటోను తీశాడు. పైగా ఈ ఫొటోను చూస్తుంటే సింహాన్ని జంతువులన్నికంటే ప్రత్యేకంగా చూస్తూ…. రాజుగా ఎందుకు అభివర్ణిస్తరో అర్థమైందని తెలిపాడు.

మనకు సింహం ఆమడ దూరం ఉంటేనే దడుసుకుని చస్తాం. అలాంటిది ఈ ఫొటోను తీసేటపుడు సిమోన్ కు ఆ మృగరాజు కేవలం 30 అంటే 30 అడుగుల దూరంలో నే ఉందని అతడు వివరించాడు. అలా 30 అడుగుల దూరంలో ఉన్న ఆ సింహాన్ని తన కెమెరాతో అందంగా ఫొటో తీసానని తెలిపాడు. ఈ ఫొటోను చూసినవాళ్లు ప్రతి ఒక్కరూ వివిధ రకాలుగా కామెంట్లు చేశారు కానీ తనకు మాత్రం ఈ ఫొటోను చూస్తుంటే తన రాజ్యాన్ని చూసేందుకు నిలపడినట్టు అనిపిస్తుందని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version