ఖమ్మం: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో అడ్డగూరు పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సీరియస్ అయ్యారు. మరియమ్మ మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఎస్సై మహేశ్వర్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు రషీద్ పటేల్, జనయ్యలను సర్వీసు నుంచి తొలగించారు. ఆర్టికల్ 311 (2) బి 25 (2) ప్రకారం బాధ్యులపై వేటు వేశారు. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఇప్పటివరకూ సస్పెన్షన్‌లో ఉన్నారు. తాజాగా వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మరియమ్మ లాకప్‌డెత్.. ముగ్గురు పోలీసులపై శాశ్వత చర్యలు
-