ఇరాన్ రాజధాని టెహ్రాన్ విమానాశ్రయం సమీపంలో ఈ ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 180 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 లో కనీసం 170 మంది ఉన్నారని సమాచారం. సాంకేతిక సమస్యలతో ఈ విమానం కుప్ప కూలింది అని చెప్తున్నా అది గాల్లో పేలిపోయిన నేపధ్యంలో ఏదైనా క్షిపణి ప్రయోగం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తల నేపధ్యంలో ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ ప్రమాదంకి సంబంధించి మొదటి వీడియోని విడుదల చేసారు. విమానం కూలిపోతున్న సమయంలో తెల్లవారు జామున చీకట్లో వీడియో చిత్రీకరించారు. దీనిలో విమానం కూలిపోతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇరాన్ స్టేట్ టివి ప్రయాణికులు అందరూ చనిపోయినట్లు పేర్కొంది. టేకాఫ్ అయిన వెంటనే సంభవించిన విమాన ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా దిగ్బ్రాంతి వ్యక్తమైంది. కొంతమంది ప్రయాణీకులను రక్షించవచ్చని భావించి ఇరాన్ అధికారులు ప్రమాదానికి గురైన ప్రదేశానికి అత్యవసర సేవలను తరలించారు. కానీ విమానంలో ఉన్న అందరూ చనిపోయినట్లు తెలిసింది.
#Breaking First footage of the Ukrainian airplane while on fire falling near #Tehran pic.twitter.com/kGxnBb7f1q
— Ali Hashem علي هاشم (@alihashem_tv) January 8, 2020