వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నందమూరి అందగాడు బాలకృష్ణ ఇప్పుడు రూట్ మార్చారు. తన ఫాన్స్ కూడా నిరాశలో ఉండటంతో బాలకృష్ణ ఇప్పుడు హిట్ దర్శకులతో సినిమాలు చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన రూలర్ సినిమా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారి అంచనాలతో వచ్చినా ఫ్లాప్ అయింది.
గత ఏడాది వచ్చిన బాలయ్య సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు హిట్ దర్శకులతోనే సినిమాలు చెయ్యాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే తనకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన బి గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు బాలకృష్ణ. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘లారీ డ్రైవర్’, రౌడీ ఇన్స్పెక్టర్,
‘సమర సింహారెడ్డి’, ‘నరసింహా నాయుడు’ చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ చేసిన రెండు సినిమాలు సింహా, లెజెండ్ సూపర్ హిట్ అయ్యాయి. కొన్నాళ్ళు ప్రయోగాలు మాని బాలకృష్ణ హిట్ దర్శకులతో మంచి కథలతో వెళ్ళాలని భావిస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి బి గోపాల్ తో చేసే సినిమాను బాలకృష్ణ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.