వైరల్ వీడియో; ఫిజిక్స్ సూత్రంతో ఏనుగు పిల్లను కాపాడారు…!

-

బావి లోపల పడిపోయిన ఒక పిల్ల ఏనుగును ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించి జార్ఖండ్‌లోని అటవీ అధికారులు మరియు గ్రామస్తులు రక్షించారు. బావి నుండి ఏనుగును రక్షించిన చిత్రాలను భారత అటవీ సేవా అధికారి రమేష్ పాండే ట్విట్టర్‌లో పోస్ట్ చేసి వారిని అభినందించారు. వివరాల్లోకి వెళితే గుమ్లా జిల్లాలో ప్రమాదవశాత్తు ఏనుగు పిల్ల బావి లో పడింది. దీనితో గ్రామస్తులకు విషయం తెలిసిందే.

ఈ విషయ౦ అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు తెలియజేసారు. దానిని రక్షించడానికి అధికారులు మరియు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. గంటల తరబడి కొనసాగిన ఆపరేషన్ సమయంలో, ఏనుగు పైకి తేలే విధంగా బావి లోపల నీరు నింపారు. దీనితో ఆ ఏనుగు పిల్ల బయటకు వచ్చింది. ఏనుగు పైకి వచ్చే వరకు కూడా అలా నీరు నింపుతూనే ఉన్నారు. దీనితో అది బయటకు తేలింది.

ఆ తర్వాత వల సహాయంతో దాన్ని బయటకు లాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. మనుషులకు కాపాడటం అయినా చంపడం అయినా వచ్చు అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక అటవీ శాఖ అధికారుల తీరుని, ఆ సూత్రం ఉపయోగించాలి అనే ఆలోచనను వాళ్ళు కొనియాడుతున్నారు. “అమేజింగ్! సైన్స్ ఉత్తమమైనది. ఫిజిక్స్ పాఠం సమయంలో పిల్లలకు చూపించడానికి గొప్ప ఉదాహరణ! వారు సైన్స్ & ప్రేమ రెండింటినీ నేర్చుకుంటారు” అని ఒకరు కామెంట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version