కోనసీమలో కొత్త వైరస్… భయపడుతున్న ప్రజలు…!

-

ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ గురించి తీవ్ర స్థాయిలో భయపడుతున్న సంగతి తెలిసిందే. దీనితో మన దేశంతో పాటు అన్ని దేశాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు. మన దేశానికి దీని ప్రభావ౦ అంతగా లేదు గాని ఇప్పుడు ఒక వైరస్ మాత్రం కోనసీమను భయపెడుతుంది. ప్రశాంతంగా ఉన్న గోదావరి తీరం ఇప్పుడు ఈ కొత్త వైరస్‌తో వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

వివరాల్లోకి వెళితే ఉభయగోదావరి జిల్లాల ప్రజలను ఒక భయ౦ వెంటాడుతుంది. అదే హెర్సీస్ వైరస్… దీని వల్ల లంపి స్కిన్ అనే వ్యాధితో జంతువులు, పక్షులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి. అక్కడ రోజు రోజుకి ఈ వైరస్ తీవ్రమవుతుంది. పశువులకు, కోళ్లకు శరీరంపై భయంకర కంతులు, రంధ్రాలు వచ్చి తీవ్ర రక్త స్రావంతో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయని గోదావరి జిల్లాల వాసులు అంటున్నారు.

ఉత్తరాది జిల్లాల నుంచి కోనసీమకు ఈ వైరస్ పాకిందని అక్కడి పశువైధ్యులు అంటున్నారు. ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ చర్యలకు దిగినా సరే లాభం లేకపోయింది. దీనికి ఏ విధమైన మందు లేదని అధికారులు అంటున్నారు. ఇక గేదెలు, కోళ్ళు సహా పలు పక్షులు, జంతువులు ఈ వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోతున్నాయని దీనిపై అధికారులు ఏదోక చర్యలు తీసుకోకపోతే తాము భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version